Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

విజయ్‌ తమిళనాడు సీఎం కాకముందు చేసిన ఆఖరి సినిమా.. సీఎం అయ్యాక ఫస్ట్ సినిమాగా రిలీజ్ అవుతోంది. అదే ‘జన నాయగన్‌’. ఈ సినిమా కోసం తమిళనాట ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దానికి మరో కారణం ఈ సినిమాకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకైపోవడం. ఈ కారణంగా ఏర్పడిన సానుభూతి, సినిమా మీద ఉన్న అంచనాలు కలగలిపి పెద్ద ఎత్తున బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ అంశాలు చాలవనట్లు ఈ సినిమాలో ఓ కీలకమై పాత్ర గురించి దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Varun Chakravarthy

అదే, ఈ సినిమా ఆఖరున వచ్చే రిపోర్టర్‌ పాత్ర. కాసేపు కనిపించినా ఈ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది అంటున్నారు. అలాంటి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఓ ఐదుగురి పేర్లు వినిపించాయి. అందులో ముగ్గురు నేటి తరం దర్శకులు కాగా, మరో వ్యక్తి నిన్నటి తరం దర్శకుడు. ఇంకో వ్యక్తి టీమ్‌ ఇండియా క్రికెటర్‌. ఈ విషయం గురించి దర్శకుడు హెచ్‌.వినోద్‌ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘జన నాయగన్‌’ రిపోర్టర్‌ పాత్ర గురించి అనుకున్నప్పుడు రెండు, మూడు ఆలోచనలు వచ్చాయి. ఫైనల్‌గా నా మనసులో ఉన్న విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌కే మొగ్గు చూపాను అని వినోద్‌ తెలిపారు. మిగిలినవారు దర్శకులు అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. వీరు కాకుండా ఇండియన్‌ స్టార్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కూడా అనుకున్నారట వినోద్‌ టీమ్‌. ఆయన డైరక్షన్‌ టీమ్‌ అయితే అట్లీ, లోకేశ్‌, నెల్సన్‌లో ఒకరిని అడుగుదాం అన్నారట. కానీ వినోద్‌ మాత్రం ఎస్ఏ చంద్రశేఖర్‌కే మొగ్గు చూపారట.

ఇక ఈ సినిమాకు ‘నాలయ తీర్పు’ అనే పేరు పెడదాం అనుకున్నార తొలుత. అంటే విజయ్‌ తొలి సినిమా పేరు అన్నమాట. అంటే తొలి సినిమా, ఆఖరి సినిమా పేరు ఒకేలా ఉంటాయి కదా అనుకున్నారట. కానీ సినిమా కథ పూర్తయ్యేసరికి ‘జన నాయగన్‌’ అయితేనే బాగుంటుంది అని అదే పెట్టారట.

ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus