Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ గురించి వైరల్‌ పుకారు.. నిజమైతేనా?

  • August 1, 2022 / 01:19 PM IST

సినిమా ప్రకటన రావడం ఆలస్యం.. ఆ సినిమా మీద ఏదో ఒక పుకారు మొదలవుతుంది. విచిత్రం ఏంటంటే ఆ పుకార్లు చాలావరకు నిజమవుతుంటాయి. ఇక సినిమా షూటింగ్‌ మొదలైతే పుకార్ల వాడి వేడి ఎక్కువవుతుంది. తాజాగా అలాంటి పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్న చిత్రాల్లో ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు) ఒకటి. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో, ఇండస్ట్రీలో ఓ పుకారు వినిపిస్తోంది. అది గనక నిజమైతే సినిమా ఓ లెవల్‌ అని చెప్పొచ్చు.

‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి హీరో కాగా, కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారనే విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే పుకారు వినిపించి.. తర్వాత డౌట్‌గా అనిపించి.. ఆఖరికి టీమ్‌ రిలీజ్‌ చేసిన వీడియోతో వీరయ్యతో రవితేజ అనే పుకారు నిజమని తేలింది. ఇంతలోనే ఈ సినిమాలో ఇద్దరూ సవతి సోదరుల్లా నటిస్తున్నారు అనే మరో పుకారు బయటకు వచ్చింది. దీని సంగతి తేలుద్దాం అనుకునేలోగా మరో హాట్‌ హాట్‌ రూమర్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి దొంగగా నటిస్తుంటే, రవితేజ పోలీసులా కనిపిస్తాడు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మీద దానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని భోగట్టా. ఈ సినిమా విశాఖపట్నం – సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది అని పోస్టర్‌ చూడగానే, టైటిల్‌ వినగానే తెలిసిపోతుంది. ఇందులో చిరంజీవి అండర్‌కాప్‌ పోలీసు అని తొలుత వార్తలొచ్చాయి. ఇప్పుడు దొంగ అని అంటున్నారు. అండర్‌ కవర్‌లో ఉన్నప్పుడు చిరంజీవి దొంగగా కనిపిస్తాడా, లేక పూర్తిగా దొంగనా అనేది తెలియాలి.

చిరు సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన కేథరిన్‌ను తీసుకున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి ఆమెనే ఉందా? వేరొకరిని తీసుకున్నారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే వచ్చే పొంగల్ ఫైట్‌కి వీరయ్య రెడీ అవుతాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus