Devara: తారక్‌ – కొరటాల ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందా? అదే ఇబ్బంది పెట్టిందా?

సినిమా ప్రచారంలో లీకులు కూడా ఓ భాగం. ఎవరు అవనన్నా కాదన్నా ఈ మాట నిజం. విషయాలు లీక్‌ అవ్వడం, పోస్టర్‌లు బయటకు రావడం, హైప్‌ తెచ్చే సీన్స్‌ ఇవీ అని చూఛాయగా చెప్పేయడం లాంటివి చేస్తుంటారు. అలాగే కొన్ని అంచనా అనుకున్న మాటలు కూడా వచ్చేస్తుంటాయి. సినిమా ట్రైలర్‌ను డీకోడ్‌ చేసేవాళ్లు ఎక్కువైన నేపథ్యంలో ఇవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి కూడా. ఒక్కోసారి ఇవి సినిమాకు బాగా కలిసొస్తాయి. కానీ ఒక్కోసారి సినిమాకు ఇవే మైనస్‌ అవుతాయి.’

Devara

నెక్స్ట్‌ ఏమవుతుంది? ఎవరు ఎప్పుడు వస్తారు? ఏ సీన్‌ ఎలా ఉంటుంది? ఏది నిజం? ఏది అబద్దం? అని జనాలు అంచనాకు వచ్చి సినిమా చూస్తుంటారు. దీంతో మజా తగ్గి సినిమా మీద ఎఫెక్ట్‌ పడుతుంది. ఇప్పుడు ‘దేవర’ (Devara) సినిమా విషయంలోనూ ఇదే జరిగిందా? అవుననే అనిపిస్తోంది సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే. ఎందుకంటే ఎంతో రెస్పాన్స్‌ రావాల్సిన సన్నివేశాలకు థియేటర్లలో ఆ స్థాయి రెస్పాన్స్‌ రావడం లేదు.

దేవర, వర మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ ఆ విషయం తెలిసిన తొలి సన్నివేశం నుండి సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఎందుకంటే దేవరగా భయపెడుతోంది వర అని ముందే అనే విషయం బయటకు వచ్చేసింది కాబట్టి. సినిమాలో జాన్వీ (Janhvi Kapoor) సెకండాఫ్‌కి కానీ రాదు.. అని ముందే తెలిసిపోవడంతో ఆమె గురించి అంచనాలు లేవు. ట్రైలర్‌లను డీకోడ్‌ చేసే క్రమంలో కొన్ని వివరాలు బయటకు వచ్చేయడంతో వర ‘ఆయుధాల’ ఫైట్‌ ఆసక్తి తగ్గించేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా స్పాయిలర్స్‌ ఎక్కువ బయటకు వచ్చేస్తాయి. అందుకే ఇలాంటి లీకులు, గెస్సింగ్‌లు సినిమాను ఇబ్బంది పెట్టాయి అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని సన్నివేశాలు, ట్విస్ట్‌లు రాసి అంచనాలను మార్చాల్సింది దర్శకుడు కొరటాల శివనే (Koratala Siva) . ఈ విషయంలో సినిమా ఒకడుగు వెనక్కి వేసింది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి దీనిని అధిగమించి సినిమా బాక్సాఫీసు దగ్గర రాణించాలని ఆశిద్దాం.

దేవర విషయంలో కొరటాల శివ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus