Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితం నుండే ‘పుష్ప’ క్యారెక్టర్ పుట్టిందా?

అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప'(ది రైజ్) (Pushpa: The Rise) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేసేసి.. ఆ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాడు. అందుకే అతనికి జాతీయ అవార్డు లభించింది. అయితే ‘పుష్ప’ కథని ఒకసారి నెమరువేసుకుంటే.. ‘ఓ కూలీ… ఎర్రచందనం సిండికేటర్..గా ఎదిగిన విధానమనే’ చెబుతారు. కానీ కొంచెం డీప్ గా వెళ్తే.. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.

Pushpa 2

ముఖ్యంగా పుష్ప రాజ్(అల్లు అర్జున్) తల్లి.. అతని తండ్రికి రెండో భార్య. కుటుంబ సభ్యులు పుష్పరాజ్ ను, ఆమె తల్లిని చేరదీయరు. ఇది కొంచెం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జీవితానికి దగ్గరగా ఉన్న లైన్ అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. 2009 ఎన్నికల టైం వరకు ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ చేరదీసింది లేదు. ఆ టైంలోనే ఎన్టీఆర్.. ఆ కుటుంబానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న సందర్భాలు వేరు.

వీటన్నిటినీ గమనించే దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ కథ రాసుకున్నట్టు చాలా మంది చెప్పుకొచ్చారు. అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ సినిమాలో అయితే జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్..లు కనిపించాయి. అంతేకాదు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘వాళ్ళు నిన్ను విసిరేశారని అనుకోని .. వాళ్లకి తెలీదు నువ్వొక బంతివని’ అంటూ కొన్ని లిరిక్స్ ఉంటాయి. ఎన్టీఆర్ నిజ జీవితాన్ని ఆధారం చేసుకునే సుకుమార్ ఆ లిరిక్స్ రాయించుకున్నాడట.

అంతేకాదు ‘పుష్ప’ లో ‘ఎవడ్రా ఎవడ్రా నువ్వు అనే పాట’ కూడా జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో రాసిందే అని ఇంకొందరు అంటుంటారు. ‘పుష్ప 2’ (Pushpa 2)  లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్..లు ఉంటాయని ఇన్సైడ్. ముఖ్యంగా ‘పుష్ప అన్న(అజయ్) ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు .. పుష్ప వచ్చి ఆడుకుంటాడట. అప్పుడు అతన్ని, అతని తల్లిని.. ఆ ఫ్యామిలీ చేరదీస్తుంది అని తెలుస్తుంది. ఇక ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. డిసెంబర్ 5 నుండే ప్రీమియర్స్ కూడా వేస్తారని నిర్మాత చెప్పిన సంగతి తెలిసిందే.

 ‘గేమ్ ఛేంజర్’ తో పాటు ఆ సినిమా కూడా సంక్రాంతికేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus