పండుగల సీజన్లని క్యాష్ చేసుకోవాలని ప్రతీ నిర్మాతకి ఉంటుంది. అందుకే షూటింగ్ దశలో ఉండగానే.. రిలీజ్ డేట్లని లాక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కి బాగా డిమాండ్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూసేది ఈ సీజన్లోనే..! సంక్రాంతిని మన ప్రేక్షకులు సినిమాతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఈ సీజన్లో జనాలు చూస్తారు. ఎటొచ్చీ థియేటర్ల షేరింగ్ వద్దే వస్తుంది సమస్య అంతా..!
ప్రతి సీజన్..కి ఇలాంటి సమస్యలు చూస్తూనే ఉన్నాం. 2023 సంక్రాంతికి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ తమ 2 పెద్ద సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసింది. ఆ టైంలో దిల్ రాజు (Dil Raju) తన ‘వారసుడు’ (Varasudu) చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అంటూ వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినీ చరిత్రలో ఒక నిర్మాత తమ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్లు కొట్టడం అనేది అదే మొదటిసారి.
అయితే ఈసారి దిల్ రాజు కూడా ‘మైత్రి’ బాటలోనే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అవును దిల్ రాజు నిర్మాణంలో ‘గేమ్ ఛేంజర్’ (Game changer) రూపొందుతుంది. డిసెంబర్ 20కి రిలీజ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల.. అది సంక్రాంతికి వాయిదా పడింది. మరోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. దానికి కూడా దిల్ రాజే నిర్మాత. ఆ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట.
‘విశ్వంభర’ (Vishwambhara) 99 శాతం సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ సినిమా కాబట్టి.. వెంకీ- అనిల్ రావిపూడి..ల సినిమాకి ఇబ్బంది ఉండదు. అయితే థియేటర్ల విషయంలో మిగిలిన నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారు? అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య (Balakrishna) – బాబీ (Bobby) ..ల సినిమాను కూడా దిల్ రాజే నిర్మిస్తారనే టాక్ కూడా ఇప్పుడు ముమ్మరంగా నడుస్తుంది.