పాన్ ఇండియా సినిమాల్ని అనౌన్స్ చేయడం, షూటింగ్ చేయడం ఎంత కష్టమో… వాటిని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కూడా అంతే కష్టం అంటుంటారు. ఈ మాటను నిజం చేస్తూ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు వరుసగా వాయిదా మంత్రం జపిస్తున్నాయి. క్లియర్‌గా అనౌన్స్ చేయకపోయినా ఆ దిశగా సినిమా పనులు సాగుతున్నాయి అని అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసినా ఆ మాట మీద నిలబడటం కష్టం అంటున్నారు.
ప్రస్తుతం దేశంలో తెరకెక్కుతున్న అతి పెద్ద సినిమాల్లో ‘కల్కి’ది మొదటి స్థానం అనొచ్చు. అధికారికంగా చెప్పలేదు కానీ సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని టాక్. ఎన్ని పార్టులు అని లెక్క చెప్పలేదు కానీ రెండు పార్టులు ఉండొచ్చు అనేది టాక్. ఈ సినిమాను మే 9న విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించేసింది. అయితే మరో టాలీవుడ్ సినిమా చేస్తున్న ప్లాన్స్ చూస్తుంటే (Kalki) ‘కల్కి’ కూడా పోస్ట్ పోన్ అవుతుందేమో అనిపిస్తోంది.
మార్చి 8న వచ్చేస్తాం అంటూ ఆ మధ్య సినిమా స్టార్ట్ అయినప్పుడే అనౌన్స్ చేసేశారు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్. అయితే రిలీజ్‌కు ఇంకా నెల రోజులే ఉన్న ఈ సమయంలో డేట్ మారుతుంది అని లీక్‌లు ఇస్తున్నారు. అంతేకాదు రెండు నెలలు వాయిదా వేసి సినిమాను మే 9కు తెస్తాం అని కూడా అంటున్నారట. అదే జరిగితే ఆ రోజు రావాల్సిన ‘కల్కి’ రానట్లే అని చెబుతున్నారు. అది తమకు స్పెషల్ డేట్ అని వైజయంతి మూవీస్ చెప్పినా సినిమా వచ్చే పరిస్థితి లేదని ఇన్సైడ్ టాక్.
అందుకే ‘డబుల్ ఇస్మార్ట్’ను అంత ధైర్యంగా అప్పుడు తీసుకొస్తున్నారని టాక్. ఒకవేళ 9 కాకపోతే 23 అనుకుంటున్నారట. మరోవైపు ఏప్రిల్ మొదటి వారంలో రావాల్సిన ‘దేవర’ వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి. అలాగే ఆగస్టులో రావాల్సిన ‘పుష్ప 2’ కూడా వాయిదా వేస్తారని చెబుతున్నారు. దీంతో పాన్ ఇండియా వాయిదాలు పెరుగుతున్నాయి అనే సన్నాయి నొక్కులు ఎక్కువయ్యాయి అని చెప్పాలి.