FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్ రిలీజ్‌కి కారణమిదేనా?
- September 7, 2026 / 01:20 PM ISTByFilmy Focus Desk
అసలే విజయాలు లేవు.. తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు అనే విమర్శలూ ఉన్నాయి. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని జనాల మధ్యలోకి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ కథా నాయకుడు విశ్వక్ సేన్ ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్‌ను ఢీకొట్టడానికి రెడీ అయ్యాడు. తన కొత్త సినిమాను ప్రభాస్ సినిమాకు పోటీగా తీసుకొస్తామని చెప్పాడు. దీంతో ఏమవుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
FAUZI – LEGACY
విశ్వక్‌సేన్ హీరోగా ‘పిండం’ లాంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన సాయి కిరణ్ రెడ్డి దైదా రూపొందిస్తున్న సినిమా ‘లెగసీ’. ఈ సినిమాను డిసెంబరు 4న రిలీజ్ చేయబోతున్నట్లు టీం ప్రకటించింది. మామూలుగా అయితే ఇది నార్మల్ డేట్. కానీ దానికి ఒక్క రోజు ముందే అంటే డిసెంబరు 3న ‘ఫౌజీ’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న సినిమా ఇది.
ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ వైబ్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాతో పోటీకి విశ్వక్ సిద్ధమవుతున్నాడు అంటే.. అయితే తన సినిమా మీద భారీగా ఉండాలి. లేదంటే ‘ఫౌజీ’ సినిమా ఆ రోజుకు విడుదల చేసే పరిస్థితి లేదు అని ‘లెగసీ’ సినిమా టీమ్‌కి తెలిసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో విశ్వక్‌సేన్ అండ్ కో. చెప్పాలి. ఇక్కడే ఇంకో డౌట్ కూడా ఉంది. పెద్ద సినిమా హౌస్‌ఫుల్స్ తర్వాత వచ్చే రిటర్న్స్ తమ సినిమాకు ఉపయోగపడతాయి అని అనుకుకొని కూడా ఉండి ఉండొచ్చు.
అయితే, ఇక్కడే ఓ మాట ఉంది.. గత కొన్ని సినిమాలు ఇంకా కచ్చితంగా చెప్పాలి అంటే.. మూడేళ్ల నుండి విజయాలు లేవు. ఇప్పుడు చేస్తున్నది చాలా పెద్ద రిస్క్. తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని కోరుకునే అందరికీ విశ్వక్ ఎలాంటి కంటెంట్ ఇస్తాడో చూడాలి.
















