Nayanthara: రెండు ఇల్లు కొన్న నయనతార.. ఇంటీరియర్ కోసం స్పెషల్ ప్లాన్!

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు అభిమానులు. ఇటీవల ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లింది. తిరిగొచ్చిన అనంతరం సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది నయన్. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా కపుల్ రెండు కొత్త ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలో పోయెస్‌ గార్డెన్‌ ఏరియాలో చాలా మంది సెలబ్రిటీలు నివసిస్తుంటారు.

ఈ ఏరియాలో రజనీకాంత్, జయచిత్ర ఇళ్లతో పాటు జయలలిత నివాసం వేద నిలయం ఉంది. దానికి ఎదురుగా ఆమె నెచ్చెలి శశికళ సైతం ఓ భారీ బంగ్లాను కట్టించారు. ఇప్పుడు నయనతార కూడా తన భర్తతో కలిసి అదే ఏరియాలో ఉండబోతుంది. అందుకే అక్కడ రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని సమాచారం. వీటి ఖర్చే కోట్లలో ఉందనుకుంటే.. ఇంటీరియర్ డిజైన్ కోసం మరిన్ని కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతోంది నయనతార.

దీనికోసం బాలీవుడ్‌ స్టార్స్‌ ఇళ్లకు ఇంటీరియర్‌ డిజైన్‌ చేసే ఒక ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీనికోసం సదరు సంస్థ రూ.25 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. అంత మొత్తం ఖర్చు చేయడానికి నయన్ వెనుకడుగు వేయడం లేదు. ఈ ఇంట్లో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్‌శివన్‌ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే మరిన్ని సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఇంట్లోకి నయన్-విఘ్నేష్ అడుగుపెట్టనున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus