తెలుగు స్లండాగ్ మిలినియర్ “నిర్మల కాన్వెంట్”?

  • May 12, 2016 / 09:38 AM IST

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న నిర్మల కాన్వెంట్ సినిమా స్టొరీ బాలీవుడ్ హిట్ సినిమా, ఆస్కార్ అవార్డు పొందిన స్లండాగ్ మిలినియర్ కథను పోలి ఉంటుందని సమాచారం. నాగ కోటేశ్వరరావు డైరెక్టర్ గా పరిచయ మవుతున్న ఈ సినిమాలో హీరో నాగార్జున  మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ గా అలరించనున్నారు.

హీరో రోషన్ తను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొని డబ్బులు గెలుస్తాడు, ప్రేమలో కూడా గెలుస్తాడు. ఈమధ్యనే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.  స్లండాగ్ మిలినియర్  సినిమా కు ఏ ఆర్ రహమాన్ పాట పాడితే ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ కొడుకు ఏ ఆర్ అమీన్ “కొత్త కొత్త భాష ” అనే పాట పాడారు. ఈ పాట యూత్ ని భలే ఆకట్టుకుంది. మరి ఈ చిత్రం ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus