కబాలి ఆ సినిమాకు కాపీనా..?

Advertisement

రజినీకాంత్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్టు సినిమా పడట్లేదు. తాజాగా రజిని నటించిన ‘కబాలి’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. క‌బాలి టీజ‌ర్‌, అందులోని ర‌జ‌నీ గెటప్స్‌.  చెప్పిన డైలాగ్ ఇవ‌న్నీ ర‌జ‌నీ ఫ్యాన్స్‌ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. క‌బాలి బాషాలా ఉంటుందా, క‌బాలి రోబోని అధిగ‌మిస్తుందా అంటూ అప్పుడే అభిమానులు లెక్క‌లేసుకొంటున్నారు. ఈలోగా క‌బాలికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమా ఛ‌త్ర‌ప‌తి క‌థ‌ని పోలి ఉంటుంద‌ట‌.

ఛ‌త్ర‌పతిలో హీరో, అత‌ని గ్యాంగ్.. ఓ ముఠా ద‌గ్గ‌ర బానిస‌లుగా ఉంటారు. ఊరు కాని ఊరులో ఉపాధి కోసం వెట్టి చాకిరి చేస్తుంటారు. వాళ్ల‌ని హీరో ఎదిరిస్తాడు. నాయ‌కుడిగా మార‌తాడు. అక్క‌డ నుంచి హీరో .. ఛ‌త్ర‌పతి అవ‌తారం ఎత్తుతాడు. క‌బాలి క‌థ కూడా అలాంటిదేన‌ట‌. ఇండియా నుంచి కొంత‌మందిని మలేషియా తీసుకెళ్లి అక్క‌డో రబ్బర్ కంపెనీలో వెట్టి చాకిరి చేయిస్తుంటారు. వాళ్ల‌లో ఒక‌డే… క‌బాళీశ్వ‌ర్‌. త‌ను విల‌న్ గ్యాంగ్‌ని ఎదిరించి నాయ‌కుడిగా మార‌తాడు. డాన్‌… క‌బాలిగా మారి మలేషియాను గ‌డ‌గ‌డ‌లాడిస్తాడు. స్టోరీ లైన్ ఇంచుమించుగా ఒకేలా ఉన్నా ట్రీట్ మెంట్‌, ర‌జ‌నీ స్టైల్ ఇవ‌న్నీ క‌బాలికి ఫ్రెష్ లుక్ తీసుకురావ‌డం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news