విడుదలకు ముందే సరైనోడు లీక్ అయ్యిందా..?
- April 16, 2016 / 10:37 AM ISTByFilmy Focus
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ తెరిసాలు జంటగా నటిస్తున్న చిత్రం సరైనోడు. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ చిత్రం లీకైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని దాదాపు 15 నిమిషాల నిడివి గల సన్నివేశాలు ఇంటర్నెట్ లో ఈరోజు దర్శనమిచ్చాయి. కాగా.. వెంటనే అప్రమత్తమైన చిత్రసిబ్బంది వాటిని తొలగించారని సమాచారం. మరోవైపు పైరసీ దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నారట చిత్ర బృందం. ఇదంతా నిజంగానే జరిగిందా? లేక పబ్లిసిటీ కోసం యునిట్ సభ్యులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















