సోనీ తెలుగు వాళ్ల పల్స్‌ పట్టుకుంటుందా?

తెలుగువాళ్లకు ఓటీటీ అంటే అప్పటికే తెలిసున్నా… లాక్‌డౌన్‌ వచ్చాకనే బాగా జనాల్లోకి వెళ్లిందని చెప్పొచ్చు. అప్పటికే ఓటీటీల్లో సినిమాలు వస్తున్నా… థియేటర్‌లో వచ్చిన ఏ 20 రోజులకో, 30 రోజులకో వచ్చేవి. దీంతో ఓటీటీ సెకండ్‌ ఆప్షన్‌ మాత్రమే. కానీ లాక్‌డౌన్‌ టైమ్‌లో కొత్త కొత్త కంటెంట్‌ ఇవ్వడం, జనాలు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడటంతో చాలామంది ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఆ సమయంలోనే తెలుగులో ఎంటర్‌ అయ్యింది ‘ఆహా’. తొలి నాళ్లలోనే మంచి కంటెంట్‌తో ‘తెలుగు ఓటీటీ’ అనిపించుకుంది. అప్పటికే తెలుగు కంటెంట్‌ అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌, జీ5, సన్‌ నెక్స్ట్‌, ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే తెలుగు కంటెంట్‌ అంటే సినిమాలు మాత్రమే. దీంతో ఆహా ఎదుగుదల ఆగలేదు. అయితే ఇప్పుడు తెలుగులోకి మరో ఓటీటీ రాబోతోంది. అదే సోనీ లివ్‌.

నిజానికి సోనీ లివ్‌ కొత్తదేం కాదు. బాలీవుడ్‌లో చాలా కాలంగా మంచి జోరు చూపిస్తోంది. హిందీ షోస్‌, సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల పల్స్‌ను పట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో తెలుగు కంటెంట్‌కు ఓ టీమ్‌ను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మధుర శ్రీధర్‌రెడ్డిని తెలుగు కంటెంట్‌ హెడ్‌గా నియమించుకుంది. ఆయన ఆధ్వర్యంలో టీమ్‌… తెలుగు కంటెంట్‌ జనరేషన్‌ చేస్తుందిట. లోకల్‌ కంటెంట్‌ లేకపోతే సోనీ లివ్‌ కూడా అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌, జీ 5 లా మారిపోయే అవకాశం ఉంది. దీంతో సోనీ లివ్‌ పక్కా ప్లాన్స్‌ వేస్తోందిట.

‘ఆహా’లో కంటెంట్‌ అంటే… కొన్ని పాత సినిమాలు, కొత్త టాక్‌ షోసే. స్టార్లను తీసుకొచ్చి సమంత, తమన్నా, రానా లాంటివారితో టాక్‌షోలు, సిరీస్‌లు చేశారు. దీంతో జనాలను బాగా అట్రాక్ట్‌ చేశారు. తెలుగు సినిమాలు తక్కువగా తీసుకున్నా, ఇతర పరిశ్రమల సినిమాలను రీమేక్‌ చేసి… తెలుగులో విడుదల చేయడం మొదలెట్టారు. దీంతో బాగా ఆకట్టుకున్నారు. అలా అని స్ట్రెయిట్‌ సినిమాలు తీసుకురాలేదని కూడా చెప్పలేం. ‘భానుమతి రామకృష్ణ’, ‘కలర్‌ ఫొటో’ లాంటివి అలా వచ్చి హిట్‌ అయ్యాయి. ఇప్పుడు సోనీ లివ్‌ ఇలానే ఆలోచిస్తుందా? లేక కొత్తగా ఆలోచిస్తుందా? అనేది చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus