Sreeleela: సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీ లీల…అదే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ఉన్నపలంగా సినిమాలకు బ్రేక్ ప్రకటించారు. యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ఈ నాలుగు నెలల కాలంలో నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ నాలుగు సినిమాలలో భగవంత్ కేసరి మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ మిగిలిన సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి.

ఇటీవల నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీలీలకు మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత ఈమె కొన్ని రోజులపాటు తన సినిమాలకు విరామం ప్రకటించారని తెలుస్తుంది. అయితే ఉన్నఫలంగా సినిమాలకు ఈమె విరామం ప్రకటించడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే తనకు ఇప్పుడు పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు అని తెలుస్తుంది.

శ్రీ లీల ఒకవైపు హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో తనకు పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ఈ నెలలో ఆమెకు పరీక్షలు ఉండడంతో బ్రేక్ ఇచ్చారు.పరీక్షలు పూర్తి కాగానే తిరిగి తన సినిమా పనులలో బిజీ కానున్నారు.

ఇక శ్రీలీల (Sreeleela) సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరికెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మంచి సక్సెస్ అయితే శ్రీ లీల కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదు లేదంటే ఈ కేరియల్ ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus