Hero Nani: స్పెషల్‌ లేడీస్‌ వీళ్లే అంటున్నారు మరి!

  • June 18, 2021 / 01:31 PM IST

నాని ప్రొడ్యూస్‌ చేస్తున్న ‘మీట్‌ క్యూటీ’ సినిమా లేడీస్‌ స్పెషల్‌ అని ఇటీవలే మనం చెప్పుకున్నాం. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ హీరోయిన్లు వీళ్లే అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ… వినిపిస్తున్న పేర్లు చూస్తుంటే పుకార్లు నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘మీట్‌ క్యూట్‌’ సినిమాలో ప్రధాన హీరోయిన్‌ పాత్ర కోసం కాజల్‌ అగర్వాల్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కాజల్‌ ఇప్పటికే నాని బ్యానర్‌లో ‘అ!’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ పరిచయం, అందులో ఆమె నటనకు వచ్చిన పేరు చూసి నాని మరోసారి ఆమెను కాంటాక్ట్‌ చేస్తున్నారట. మరోవైపు కాజల్‌ ఇటీవల కాలంలో వరుస సినిమాలు ఓకే చేసేస్తుంది. రెమ్యూనరేషన్‌ విషయంలోనూ పెద్దగా పట్టుబట్టడం లేదని టాక్‌. కాజల్‌తోపాటు ఈ సినిమాలో నివేదా థామస్‌, అదా శర్మ కూడా నటిస్తారని టాక్‌. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ముగ్గురు తెలిసిన ముఖాలు.

వీరు కాకుండా మరో ఇద్దరు కొత్త భామలు ఈ సినిమాలో నటిస్తారట. అలా మొత్తంగా ఐదుగురు నాయికలు అన్నమాట. దీంతోపాటు సినిమాలో సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తెరకెక్కుతోన్న ‘మీట్‌ క్యూట్‌’ను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus