మైత్రీ మూవీ మేకర్స్… గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగుతోంది. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసి విజయాలు సాధించింది అదరగొట్టారు. ఆ తర్వాత పెద్ద సినిమాలు ప్రకటిస్తూ, స్టార్ట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఏ సినిమాకా సినిమా షూటింగ్ జరిగిపోతోంది అనుకుంటుండగా.. ప్రొడక్షన్ హౌస్ మరో విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదే ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు. టాలీవుడ్‌కి ఈ దాడులు కొత్త కాకపోయినా..
మైత్రీ (Mythri Movie Makers) వాళ్ల మీద జరుగుతున్న దాడులు మాత్రం చాలా పెద్ద విషయం అంటున్నారు. ఏప్రిల్ 19 నుండి మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై, సన్నిహితుల ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే బయటకు రాలేదు కానీ.. కొన్ని వర్గాల సమాచారం ప్రకాం అయితే మైత్రీ సంస్థలోకి రూ.700 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లుగా గుర్తించారట. అదెలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయంలో విచారణ జరుగుతోందట.
ఈ విషయంలో క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ.. నిర్మాతలైతే కూల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎడిటింగ్‌కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆ డబ్బుల సంగతి చూస్తే… విదేశాల నుండి భారీస్థాయిలో వచ్చిన ఈ పెట్టుబడులు తొలుత ముంబయికి చెందిన ఓ కంపెనీకి టాన్స్‌ఫర్ అయినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. అలా వచ్చిన డబ్బును ఏడు కంపెనీలకు బదిలీ చేశారని అంటున్నారు.
అంతేకాదు ఓ బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ కోసం స్టార్ డైరెక్టర్‌కు హవాలా ద్వారా రూ.150 కోట్ల అందజేశారని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న దాడులకు ఆ లావాదేవీనే కారణం అని కూడా చెబుతున్నారు. అక్కడ తీగ లాగితే మొత్తం డొంక కదిలింది అని అంటున్నారు. అయితే గతంలోనూ కొన్నిసార్లు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అంటున్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?