Krish 4 Story: హృతిక్ కోరికను క్రిష్ 4 తీరుస్తుందా..?

  • June 25, 2021 / 07:43 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే క్రిష్ సిరీస్ కు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. క్రిష్ విడుదలై 15 సంవత్సరాలు కాగా ఈ సిరీస్ లో త్వరలో క్రిష్ 4 రాబోతుందని సమాచారం. గడిచిన రెండు సంవత్సరాలుగా క్రిష్ 4 సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. క్రిష్ 4లో కోయీ మిల్ గయాతో పరిచయమైన జాదు కనిపించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

క్రిష్ 4 సినిమా కథకు సంబంధించి బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వార్త ప్రకారం టైమ్ ట్రావెల్ కథాంశంతో క్రిష్ 4 తెరకెక్కనుందని ఆ దిశగానే కథ సిద్ధమవుతోందని సమాచారం. తాజాగా హృతిక్ రోషన్ “గతం అయిపోయింది.. భవిష్యత్తు ఏం తీసుకొస్తుందో చూద్దాం” అంటూ చేసిన కామెంట్లు సైతం క్రిష్ 4 కథ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని నమ్మేలా ఉన్నాయి.

కోయీ మిల్ గయా, క్రిష్ ఈ రెండింటినీ ఒక చోటుకు చేర్చే కథ క్రిష్ 4 అని తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. క్రిష్ 4 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని హృతిక్ రోషన్ భావిస్తుండగా ఈ సినిమాతో అతని కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను క్రిష్ సిరీస్ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus