TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

Advertisement

2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టాలీవుడ్‌లో ఓ ఉపయోగం లేని ప్రయత్నాలు జరిగాయి గుర్తుందా? దాని వల్లే వచ్చే పేరు కంటే పోయిన పరువే ఎక్కువగా ఉండింది. అదే నాటి రాజకీయాల మీద సెటైర్లు అనే పేరుతో రూపొందించిన సినిమాలు. వాటి వల్ల ఆ సినిమాలు తీసిన నటులు, దర్శకులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఇలానే కోలీవుడ్‌లో జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో తమిళనాట రాజకీయాల్లో వేడి పెరిగింది. రాబోతున్న సినిమా ‘టీఎన్‌ 2026’ సాగా.. ఆ సినిమా విజయ్‌పై సెటైర్‌ అని అంటున్నారు. ప్రచార చిత్రాలు చూస్తే అలానే అనిపిస్తోంది.

TN 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతో తొలిసారి ప్రముఖ తమిళ హీరో విజయ్‌ బరిలోకి దిగుతున్నాడు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో విజయ్‌ ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజకీయ సదస్సుల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఆయన చేసిన సినిమాను ‘జన నాయగన్‌’ విడుదల విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ చాలవు అన్నట్లు ‘తంగ నట్చతిరమ్‌’ అనే పేరుతో ఓ సెటైరికల్‌ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

నట్టి నటరాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘తంగ నల్చతిరమ్‌’ (టీఎన్‌ 2026) సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తారట. ఇందులో విజయ్, అతని పార్టీ తమిళగ వెట్రి కళగంను కించపరిచేలా ఉందంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ‘గోల్డెన్ స్టార్’ గుల్కండ్ కుమార్ అనే పాత్రలో నట్టి నటరాజ్‌ నటించాడు. సినిమా టీజర్‌లో నటరాజ్‌ వేసుకున్న తెల్ల చొక్కా, బ్రౌన్ ప్యాంటు, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్, నడిచే తీరు.. అంతా విజయ్‌ను పేరడీ చేసినట్లుగా ఉంది.

దాంతోపాటు టీజర్‌లోని డైలాగ్‌ కూడా విజయ్‌కి కౌంటర్‌ ఇచ్చినట్లుగా ఉంది. దీంతో రాజకీయంగా విజయ్‌ని ఇబ్బంది పెట్టేలా ఉన్న ఈ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus