Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు కంటెంట్‌కు కూడా దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుండటం హర్షించదగ్గ విషయం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా.. ఇటీవల వచ్చిన క్రైమ్ అండ్ పవర్ డ్రామా ‘ఇసకపట్నం'(Isakapatnam) వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవచ్చు. జూలై 2 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్, ఇప్పుడు దేశవ్యాప్తంగా టాప్-3లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

Isakapatnam

గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రధాన బలం ఇందులోని నిర్మాణ విలువలనే చెప్పాలి. ‘తమడా మీడియా’ బ్యానర్‌పై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. థియేటర్ అనుభూతిని పంచే సినిమాటిక్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌లోనూ ఉండేలా చూసుకున్నారు.క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే, ఉత్కంఠభరితమైన కథనం, ఎవరూ ఊహించని ట్విస్టులతో అల్లుకున్న స్క్రీన్‌ప్లే వీక్షకులను కట్టిపారేస్తోంది.

ఐశ్వర్య రాజేశ్, సముద్రఖనితో పాటు సునీల్, నరేశ్ అగస్త్య వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటం.. అలాగే వారి సహజమైన నటన కూడా ‘ఇసకపట్నం’ స్థాయిని మరింతగా పెంచాయి. సాధారణ ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్ దిగ్గజాలను సైతం ఈ సిరీస్ మెప్పిస్తుండటం విశేషం. అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, వి.వి.వినాయక్, హరీష్ శంకర్, నాగ చైతన్య, సుధీర్ బాబు, తేజ సజ్జా వంటి స్టార్లు ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

రాబోయే రోజుల్లో ‘ఇసకపట్నం’.. వెబ్ సిరీస్ చరిత్రలో మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సాధించి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus