ఇజం

  • October 21, 2016 / 09:09 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి-కళ్యాణ్ రామ్ ల కలయికలో వచ్చిన ‘ఇజం’ సినిమా ఎలా వుందో, ఎలాంటి విజయం సాధించనుందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూద్దామా!

కథ : సత్య మార్తాండ్(కళ్యాణ్ రామ్) ఒక జర్నలిస్ట్. చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం వలన చలించిపోతాడు. విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ జావీద్ భాయ్(జగపతిబాబు)ను టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆలియా(అదితి ఆర్య) ప్రేమలో పడతాడు. జావీద్ భాయ్(జగపతిబాబు) కూతురే ఆలియా. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్యకు జరిగిన అన్యాయం ఏంటి? జావీద్ భాయ్ కు సత్య ఎలా దగ్గరయ్యాడు? బ్లాక్ మనీని ఎలా కొల్లగొట్టాడు? అందుకు సత్య ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు అతను అనుకున్న విధంగా సాధించాడా లేదా అనే విషయం వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : ఈ సినిమాకు ఇద్దరూ మేజర్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఒకరు దర్శకుడు పూరి జగన్నాధ్ మరొకరు హీరో కళ్యాణ్ రామ్. పూరి గురించి టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించేసాడు. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగా ‘ఇజం’ కళ్యాణ్ రామ్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్ తన పాత్రలో చక్కగా నటించాడు. సినిమా అంతా కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. ముఖ్యంగా కోర్టు సీనులో దుమ్మురేపాడు. ‘ఇజం’ సినిమాకు కోర్ట్ సీన్ హైలెట్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సిక్స్ ప్యాక్ లుక్ లో కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ఇక జావిద్ భాయ్ గా జగపతిబాబు చాలా స్టైలిష్ గా కనిపించాడు. కళ్యాణ్ రామ్-జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ అదితి ఆర్య గ్లామర్, లుక్స్ పరంగా పరవాలేదనిపించింది. కళ్యాణ్ రామ్-అదితి ఆర్యల మధ్య వచ్చే కొన్ని కొన్ని సీన్లు బాగున్నాయి. తనికెళ్ళ భరణి, అలీ, వెన్నెల కిషోర్, పోసానిలు వారి వారి పాత్రలలో బాగా చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : ఎనర్జిటిక్ డైరెక్టర్ అని తనకున్న పేరును పూరి మరోసారి నిరూపించుకున్నాడు. ‘ఇజం’ సినిమాను ఇంత సింపుల్, స్టైలిష్ మాసివ్ గా కూడా తెరకెక్కించవచ్చు అని పూరి తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఈ సినిమాకు పూరి రాసుకున్న కథ సూపర్బ్. పూరి మార్క్ తో రూపొందిన ఈ స్క్రిప్ట్ కు స్క్రీన్ ప్లే మరో హైలెట్ గా చెప్పుకోవాలి. తన మాటలు, టేకింగ్ స్టైల్ తో అదరగొట్టాడు పూరి. ముఖ్యంగా డైలాగ్స్ కు థియేటర్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ముకేష్.జి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా గ్రాండ్ గా చూపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. కానీ రీరికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అదుర్స్. ఎడిటింగ్ బాగుంది. ఇక ‘నందమూరితారకరామారావుఆర్ట్స్’ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : ‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్ కి ‘ఇజం’ సినిమాతో ఓ ఎబౌ యావరేజ్ హిట్ దొరికందనే చెప్పాలి. మొత్తంగా కాకపోయినా ఓ మోస్తరుగా అలరించే ఈ చిత్రాన్ని పూరి మార్క్ హీరోయిజం అండ్ టేకింగ్ కోసం ఒకసారి చూడవచ్చు!

రేటింగ్ : 2.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus