‘ఇస్మార్ట్ శంకర్’ ఆల్బం ఎలా ఉందంటే..?

  • July 15, 2019 / 04:22 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘పూరి కనెక్ట్స్’ ‘పూరి టూరింగ్ టాకీస్’ బ్యానర్ల పై ఛార్మీ, పూరి జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 18న విడుదల చేయబోతున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో జ్యూక్ బాక్స్ తాజాగా విడుదలయ్యింది. ఇక ఈ చిత్రంలోని పాటలు ఎలా ఉన్నాయనేది ఓ లుక్కేద్దాం రండి :

1) ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్

భాస్కర్ బట్ల లిరిక్స్ అందించిన ఈ పాటకి అనురాగ్ కులకర్ణి గాయకుడు. ఈ చిత్రంలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గా ఈ పాట ఉంటుందనుకుంట. మాస్ బీట్స్ తో ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా మాస్ బీట్స్ ఇచ్చాడు మణిశర్మ. టీజర్లో, ట్రైలర్లో కూడా ఈ పాట ఉండడంతో ప్రేక్షకుల్లోకి చాలా త్వరగా వెళ్ళిపోయింది.

2) దిమాక్ ఖరాబ్ సాంగ్

కాస‌ర్ల‌ శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ‌, సాకేత్ లు చాలా బాగా పాడారనే చెప్పాలి. ఇద్దరు హీరోయిన్లతో ఉండే ఫాస్ట్ బీట్ సాంగ్ ఇదేనని స్పష్టమవుతుంది. రామ్ తో కలిసి ఈ ఇద్దరు భామలు వేసే స్టెప్పులతో ఈ సాంగ్ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సాంగ్ ని మణిశర్మ చాలా బాగా కంపోజ్ చేశాడు.

3) జిందాబాద్ జిందాబాద్ సాంగ్

భాస్కర్ బట్ల లిరిక్స్ అందించిన ఈ పాట.. హీరో రామ్ మరియు హీరోయిన్ నభా నటేష్ కు మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ లా ఉంది. శరత్ సంతోష్, రమ్య బెహరా ఈ పాటని రొమాంటిక్ ఫీల్ కు తగ్గట్టు పాడారు. సినిమాలో చూసాక ఈ పాట మరింత బాగా నచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాట కూడా ఓకే. మణిశర్మ ఒకప్పటి పాటలని ఈ పాట గుర్తుచేస్తుంది అనడంలో సందేహం లేదు.

4) బోనాలు సాంగ్

కాస‌ర్ల‌శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటని సినిమా ప్రమోషన్లకి మొదటి నుండీ బాగా వాడుకుంటూ వస్తున్నారు. తెలంగాణ ప్రేక్షకులకే కాదు, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులతో కూడా ఈ పాట స్టెప్పులు వేయించే విధంగా ఉంది. మాస్ ఆడియన్స్ థియేటర్లలో కచ్చితంగా సందడి చేసేలా ఉంది ఈ పాట. రాహుల్, మోహన భోగరాజు ఈ పాటకి తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఆల్బుమ్ మొత్తంలో ఇది టాప్ సాంగ్ అనడంలో సందేహం లేదు.

5) ఉండిపో

భాస్కర్ బట్ల సాహిత్యం అందించిన ఈ పాట హీరో రామ్ మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ కు మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ లా ఉంది. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఈ పాటని కూడా రొమాంటిక్ ఫీల్ కు తగ్గట్టు పాడారు. లిరిక్స్ మంచి ఎమోషనల్ గా ఉన్నప్పటికీ.. హీరోయిన్ ఎక్స్ పోజింగ్, లొకేషన్లు, రొమాన్స్ తో ఈ పాట కుర్రకారుని హీటెక్కిస్తోంది అనడంలో సందేహం లేదు.

ఓవరాల్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ కు మణిశర్మ మంచి సంగీతమందించాడు. ఒకసారి వింటే.. నాలుగైదు సార్లు వినాలి అనిపించేలా పాటల్ని ఇచ్చాడు. సినిమాకి హిట్టు టాక్ రావాలేగానీ మణిశర్మ మళ్ళీ బిజీ అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus