Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Advertisement

తెలుగు సినిమా వర్గాలు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దానికి కారణం ఇప్పటివరకు పెద్దగా కాంట్రవర్శీలు లేని ఓ కమెడియన్‌ కమ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. కాంట్రవర్శీలను పాకెట్‌లను పట్టుకుని తిరిగే మాజీ న్యూస్‌ రీడర్‌/ యాంకర్‌/ రిపోర్టర్‌, ప్రస్తుతం ఆర్టిస్ట్‌ అయిన జాఫర్‌ మధ్య జరిగిన చిన్న పాటి చర్చ వీడియోనే. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ మాట్లాడుతుండగా కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను గెటప్‌ శ్రీను చెబుతాడు. దానికి వచ్చిన రియాక్షనే ఇప్పుడు ఈ కుంపటికి కారణం అని చెప్పొచ్చు.

Memu Kapulam

టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా నివురు గప్పిన నిప్పులా ఓ విసయం నడుస్తూ ఉంది. ఈ మాటను చాలామంది ఒప్పుకోకపోయినా తెలుగు సినిమాలో అయితే వర్గపోరు ఒకటి ఉందని అంటుంటారు. రెండు కాస్ట్‌ల మధ్య పోటాపోటీ మాటలు కూడా అప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పాయింట్‌కి దగ్గరగానే ఈ వీడియో కనిపిస్తుండటం గమనార్హం. కొత్త ప్రాజెక్ట్‌ ఏంటి అని గెటప్‌ శ్రీనును జాఫర్‌ అడగ్గా.. ‘మేం కాపులం’ అని చెబుతాడాయన. దాంతో కాస్ట్‌ పేరు మీద సినిమాలేంటి అంటూ జాఫర్‌ తిరిగి ప్రశ్నిస్తారు. ఇదీ ఆ వీడియోలో కనిపిస్తోంది.

నాగబాబు, గెటప్‌ శ్రీను కలసి ఓ వెబ్‌సిరీస్‌ చేయబోతున్నారు అనేది ఆ వీడియో మొదట్లోనే చెప్పాడు శ్రీను. కథ ఏంటి, ఎలా ఉండబోతోంది అనే వివరాలు అయితే చెప్పలేదు. కానీ ‘మేం కాపులం’ అనే టైటిల్‌ చెప్పేసరికి ఇదేమైనా రాజకీయ కోణంలా ఉండే ప్రాజెక్టా అనే చర్చ మొదలైంది. టైటిల్‌లో ఉన్న వర్గం, నాగబాబు వర్గం ఒకటే కాబట్టి ఆ డౌట్‌ వస్తోంది. మరి ఈ వీడియో నిజమేనా? లేక ఏదైనా సినిమా/ వెబ్‌సిరీస్‌ ప్రచారం కోసం చేశారా అనేది చూడాలి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus