జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అప్పారావు. కమెడియన్ గా తనదైన శైలిలో పంచులను వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినటువంటి ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియా వేదికగా ఈయన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి అప్పారావు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన యూట్యూబ్ ఛానల్స్ గురించి వారు పెట్టే థంబ్ నెల్స్ గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో ఎన్నో యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చాయి. అయితే ఆ యూట్యూబ్ ఛానల్ కు అత్యధికంగా సబ్స్క్రైబర్లు వారి ఇంటర్వ్యూలకు వ్యూస్ రావడం కోసం విభిన్నమైన థంబ్ నెల్స్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే అప్పారావు (Appa Rao) ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియా వల్ల యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెల్స్ వల్ల నటీనటులు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఈయన తెలియజేశారు. దీనిపై నేనొక నాటిక కూడా రాద్దామని అనుకున్నాను.ఈ విషయం గురించి నేను చాలా బాధతో చెబుతున్నాను అసలు విషయం ఏంటో తెలియక పిచ్చి పిచ్చి రాతలు రాసేస్తూ వాటికి థంబ్ నెల్స్ పెట్టడం వల్ల ఎంతోమంది నటీనటులు ఇబ్బంది పడుతున్నారు.
మరి కొంతమంది నటీనటులు బ్రతికుండగానే వారిని చంపేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.చనిపోక ముందే చనిపోయారని వార్తలు దయచేసి రాయకండి ఇలాంటి వార్తలు రాసి వారిని మానసిక క్షోభకు గురి చేయకండి.ఒక మనిషి బ్రతికుండగానే చనిపోయారు అని చెప్పే అధికారం ఎవరికి లేదు అంటూ ఈయన యూట్యూబ్ ఛానల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!