జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతు చౌదరి గురించి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సుపరిచితమైన ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే రీతూ చౌదరి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. రీతూ చౌదరి తండ్రికి గుండెపోటు రావడంతో ఈయన మరణించారు.
ఇలా తన తండ్రి హఠాత్తుగా మరణించడంతో రీతూ చౌదరి ఎంతో ఎమోషనల్ అవుతూ కుమిలిపోతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన తండ్రితో కలిసి దిగిన చివరి ఫోటోని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఇలా ఈమె తండ్రి మరణించారని వార్త తెలియగానే పలువురు సెలబ్రిటీలు తన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. తన కుటుంబంలో తన తండ్రితో ఎంతో చనువుగా ప్రేమగా ఉండే రీతూ చౌదరి తన తండ్రి మరణంతో ఎంతో కృంగిపోతున్నారు.
ఈ క్రమంలోనే తన నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ…నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా ఇలా చివరిసారిగా నీతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. నన్ను వదిలి నువ్వు ఎలా వెళ్ళిపోయావు నాన్న. నువ్వు లేకుండా నేను ఉండలేను నాకోసం తిరిగి రా నాన్న ప్లీజ్ అంటూ ఈమె బావోద్వేగమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే గతంలో ఈమె తన కుటుంబం తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఇష్టపడకపోవడంతో తన కుటుంబానికి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే తన కుటుంబంతో కలిసిపోయిన ఈమెకు తన తండ్రి దూరం కావడంతో ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?