ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ హాయిగా సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. వెండితెర పై ఆయన ఎప్పుడు రారాజే.. కాబట్టి అభిమానులు కూడా మెగాస్టార్ సినిమాల్లో ఉండడమే కరెక్ట్ అని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి ఏమాత్రం కష్టం వచ్చినా ముందుండి దానిని చక్కదిద్దుతున్నారు మెగాస్టార్. ఈ కరోనా సమయంలో ఆయన చేసిన సేవ గురించి మాటల్లో వర్ణించలేనిది. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారని.. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందని కథనాలు వినిపిస్తున్నాయి.
ఆ ప్రతిపాదనకు చిరు ఒప్పుకుంటారా? అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.అసలే రాజకీయాల పై చిరు విసుగెత్తిపోయి ఉన్నారు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. పైగా ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో నిరంతరం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోయి పోయి పవన్ కళ్యాణ్ లక్ష్యానికి ఆయన అడ్డు పడరు కదా. పైగా వైసీపీకి చిరు సపోర్ట్ చేస్తే.. జనసేన పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
పవన్ కష్టం అంతా వృధా అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులు సంభవిస్తాయి. కరోనా కష్టకాలంలో థియేటర్ యాజమాన్యాలకు జగన్ ప్రభుత్వం సాయపడటం పై చిరు అభినందించిన మాట నిజమే..! కానీ వైసీపీ ప్రభుత్వంలో చిరు చేరి రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాలు అయితే ఆయన చేయడం లేదని.. ఇన్సైడ్ టాక్. కాబట్టి.. ఇది వట్టి పుకారే అని చెప్పాలి.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?