Jagapathi Babu: తాగి తందనాలు ఆడటం అంటే ఇదే… వైరల్ అవుతున్న జగపతిబాబు పోస్ట్!

Ad not loaded.

తెలుగు చిత్రపరిషములో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకొని హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు జగపతిబాబు ప్రస్తుతం ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలలోను లేదా హీరో హీరోయిన్లు తండ్రి పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు

ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడమే కాకుండా వాటికి అద్భుతమైన క్యాప్షన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇలా జగపతిబాబు ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు ఒకప్పటి ఫోటోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో భాగంగా (Jagapathi Babu) జగపతిబాబు తన తోటి నటుడితో కలిసి ఫోటో దిగారు అయితే ఈ ఫోటోలో వీరిద్దరూ చొక్కాలు లేకుండా ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి జగపతిబాబు అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చి ఈ పోస్టును షేర్ చేశారు. ఫ్రెండ్స్ తో తాగి బట్టు ఊడతీసి తందనాలు ఆడటమ్‌ అంటే ఇదేఅని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా ఒంటిపై బట్టలు లేకుండా ఫుల్లుగా తాగి తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి జగపతిబాబుకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసినటువంటి నెటిజన్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అంటూ కొందరు కామెంట్లు చేయగా మీరు చేసే పోస్టులు మాత్రమే కాకుండా చేసే క్యాప్షన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి అంటూ ఈ ఫోటోపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus