Jagapathi Babu: అప్పుడు తేడా అన్నారు ఇప్పుడు సూపర్ అంటున్నారు జగపతిబాబు పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు ఒకరు. ఇలా కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను అభిమానులుగా సంపాదించుకున్నారు. ఇలా హీరోగా కొనసాగుతున్నటువంటి జగపతిబాబు కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అవకాశాలు లేక ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమయంలో ఈయనకు విలన్ పాత్రలలో నటించే అవకాశాలు రావడంతో ఈ పాత్రలకు కూడా కమిట్ అయ్యారు.

ఇలా లెజెండ్ సినిమా ద్వారా విలన్ పాత్రలలో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి ఈయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈయన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు

తన ఇంట్లో వంట చేస్తూ అలాగే ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా డిఫరెంట్ క్యాప్షన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా జగపతిబాబు ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో ఈయన కూడా బేబీ పింక్ కలర్ దుస్తులు ధరించి తలకు వైట్ కలర్ వేసుకొని చాలా హ్యాండ్సమ్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి (Jagapathi Babu) జగపతిబాబు ఈ ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ జుట్టుకి రంగు వేసుకునే రోజులు అప్పుడు ఈ రంగు బట్టలు వేసుకుంటే, వీడు ఆ టైప్ రా అన్నారు… ఇప్పుడు జుట్టుకి రంగు వేసుకుని, అదే రంగు బట్టలు వేసుకుంటే అదిరింది అంటున్నారు… ఏంటో ఈ అర్ధంకాని లోకం అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus