క్రేజీ విలన్….ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నాడా??

  • June 28, 2016 / 06:35 AM IST

జగపతి బాబు….టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు వచ్చినా…జగపతి బాబు అందమైన హీరోల్లో ఒకరు అన్న పదం ఎప్పటికీ మరచిపోలేము. అయితే ఆ రోజుల్లో ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంధర్భాలు చాలానే ఉన్నాయి.. ఇదిలా ఉంటే కరియర్ దాదాపుగా సామాప్తం అయిపోయింది అని అనుకున్న కాలంలో మళ్లీ టర్న్ తీసుకుని విలన్ గా మారాడు….జగపతి బాబు, అలియాస్ జగ్గు భాయ్…లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త విలానీజం చూపించిన జగ్గు భాయ్…ఆ తరువాత శ్రీమంతుడు సినిమాలో స్టైలిష్ తండ్రి పాత్రలో అందరినీ అలరించాడు.

ఇక ఆతరువాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో డిఫరెంట్, మరియు టెలివిగల విలన్ గా అందరినీ మెప్పించాడు…ఇదిలా ఉంటే నాన్నకు ప్రేమతోలో తారక్ తో విలన్ గా నటించిన జగపతి బాబు మరోసారి ఎన్టీఆర్ మీద కత్తి దూసేందుకు రెడీ అవుతున్నాడు అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి..ఇంతకీ విషయం ఏమిటంటే….ప్రస్తుతం జనతా గ్యారేజ్ చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత చేసే వక్కంతం వంశీ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా విశిష్టతో కూడుకున్నదట. అయితే ఆ రోల్ లో జగ్గు భాయ్ ను పెట్టే ఆలోచనలో ఉన్నాడట వంశీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మించబోయే ఈ సినిమాలో తారక్ తో మరోసారి డీ అంటే డీ అంటున్నాడు జగ్గు భాయ్. ఒక పక్క మాస్ హీరో మరో పక్క డిఫరెంట్ మ్యానరిజం ఉన్న విలన్….కలిపి కొడితే….బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే….చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus