రైతుగా మారిన ‘రిచ్ ఫాదర్’..!

శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో రిచ్ ఫాదర్ గా కనిపించడంతో ఆ తరువాత జగపతి బాబు ను ఆయన సన్నిహితులు అలానే పిలవడం మొదలు పెట్టారు. అయితే అలా పిలవడం తనకు ఇష్టం లేదని జగపతి బాబు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా ఇప్పుడు ఆయన ఓ రైతుగా మారాడు. అచ్చ తెలుగు పంచె కట్టుతో తలకు పాగా కట్టి.. ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న ఓ వీడియో ను జగపతి బాబు తన ఫేస్ బుక్ లో ఉంచారు.

ఈ సన్నివేశం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనిదిగా సమాచారం. ప్రస్తుతం విజయ్ 60 వ చిత్రం తో పాటు, మలయాళంలో పులిమురుగన్ చిత్రాలలో నటించడమే కాకుండా దక్షిణాది భాషల్లోని పలు చిత్రాల్లో జగపతి బాబు నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus