Jai Hanu Man: ‘జై హనుమాన్‌’లో కూడా విలన్‌ అతనేనా? ఆ వీడియో ఇప్పుడెందుకు?

టాలీవుడ్‌లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో విజయం సాధించిన చిత్రం ఏది అంటే.. కొన్ని పేర్లు వినిపిస్తాయి. అయితే బ్లాక్‌బస్టర్ అయిన సినిమా ఏంటి అంటే మాత్రం కచ్చితంగా ‘హనుమాన్‌’ పేరు చెప్పాలి. (Teja Sajja) తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రమిది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 350 కోట్లు వసూలు చేసింది. అదేంటి ఇప్పటివరకు అంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంకా ఈ సినిమా థియేటర్స్‌లో ఆడుతోంది కాబట్టి.

ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా సీక్వెల్‌ గురించి ఓ డౌట్‌ వచ్చింది. అంతేకాదు ఈ డౌట్‌ వచ్చింది ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చేసిన ఓ ట్వీట్‌ వల్లనే అని చెప్పాలి. ‘హను మాన్‌’ (Hanu Man) సినిమాలో విలన్‌ మైఖేల్‌ ఇంకా ఉంటాడా? ఆ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లో మళ్లీ కనిపిస్తాడా అనేది ఆ డౌట్‌. ‘హను – మాన్‌’ సినిమాలో సూపర్ విలన్‌గా నటించిన వినయ్‌ రాయ్‌ (Vinay Rai) మాస్క్‌, సూట్‌తో కాస్త భయపెట్టాడు. అయితే బిగ్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ సందడి చేస్తున్నాడు.

‘‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’’ అంటూ వినయ్ రాయ్‌కి సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) లో పోస్ట్‌ చేశారు. వినయ్ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కి మాస్క్‌, బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్ సిబ్బందిని షాక్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు… ఓ డౌట్‌ను రెయిజ్‌ చేస్తున్నారు.

ఈ వీడియో పాతదా, కొత్తదా.. పాతదైతే ఇప్పుడు ఎందుకు షేర్‌ చేసినట్లు అనేది ప్రశ్న. అయితే కొత్త వీడియో అయితే ‘జై హనుమాన్‌’లో కూడా మైఖేల్‌ పాత్ర ఉంటుందా అనేది ప్రశ్న. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్‌ లాంచ్‌ త్వరలో ఉంటుంది అని సమాచారం. ఇక ‘హనుమాన్‌’ అయితే రేపటి నుండి జీ5లో స్ట్రీమ్‌ అవుతుంది అంటున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus