బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం గత గురువారం రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 32 కోట్లు రాబట్టిన ఈ మూవీ రెండో రోజుతో 60 కోట్లను వసూలు చేసింది. విదేశాల్లోనూ ఎన్టీఆర్ మూవీకి ఆదరణ బాగానే ఉంది. రెండు మిలియన్ డాలర్ కి చేరువలో ఉంది. ఇక తమిళంలో కూడా జై లవకుశ మంచి వసూళ్లను సాధిస్తోంది.
మొదటి రోజు తమిళనాడు వ్యాప్తంగా 72 లక్షల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజుకు ఈ మొత్తం 1.1 కోట్లకు చేరింది. ఆదివారం మరింత కలక్షన్స్ వచ్చింది. తొలి వీకెండ్ నాటికీ 2.12 కోట్ల గ్రాస్ ను రాబట్టి ఎన్టీఆర్ తమిళనాడులోను ఆదరణ బాగుందని నిరూపించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ అన్ని రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది.