అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వీకెండ్ ని అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా… వీక్ డేస్లో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సోసోగానే కలెక్ట్ చేసింది. కానీ నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఉంది.కేరళలో మాత్రం సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.
Pushpa 2 The Rule
అక్కడ మాత్రం వీక్ డేస్లో చాలా డౌన్ అయ్యింది. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.429.58 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.175.42 కోట్ల షేర్ రావాలి.