రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ చేసినా..జై లవకుశ కి తప్పని విమర్శలు!
- May 23, 2017 / 06:57 AM ISTByFilmy Focus
తమ హీరోకి అవార్డులు వచ్చినా, సినిమా రికార్డ్స్ సృష్టించినా ఆ ఆనందాన్ని అభిమానులు ఆనందించలేకపోతున్నారు. పైగా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆ పరిస్థితి ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎదురైంది. యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న జై లవ కుశ మూవీ ఫస్ట్ లుక్ ఈనెల 19 న రిలీజ్ అయింది. ఈ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. రీ ట్వీట్స్, కామెంట్స్, షేర్స్ తో హంగామా చేశారు. ట్విట్టర్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. దాదాపు ఎనిమిది లక్షలా ఇరవై వేల ట్వీట్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ సంఖ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే కి ట్రెండ్ అయిన దానికంటే చాలా ఎక్కువ.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్ ని కూడా జై లవకుశ బ్రేక్ చేశాడు. అభిమానులు ఈ రికార్డ్ ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం వీరి ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నారు. జై లవకుశ ఫస్ట్ లుక్ నచ్చి నెటిజనులు నెలకొల్పిన రికార్డ్ కాదని, అభిమానులే టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువ నెంబర్ వచ్చేలా చేశారని విమర్శిస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















