2018 వ సంవత్సరం లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాకి అప్పట్లో ఏ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హద్దులు దాటిన అంచనాలను ఈ సినిమా కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది. కానీ అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తో కూడా ఈ సినిమా అనకాపల్లి నుండి అమెరికా వరకు దద్దరిల్లిపోయే రేంజ్ లో ఓపెనింగ్ రికార్డ్స్ ని పెట్టింది.
ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని రేంజ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లోని అమెరికా ప్రీమియర్స్ లో ఈ చిత్రం 16 లక్షల మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు పాన్ ఇండియన్ హైప్ తో విడుదల అయ్యాయి కానీ, ఒక్క రాజమౌళి సినిమా తప్ప మరొకరు ఈ ప్రీమియర్ రికార్డు ని బద్దలు కొట్టలేకపోయారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించయినా జైలర్ చిత్రం మాత్రం ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ అమెరికా ప్రీమియర్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తుంది.
ఇప్పటి వరకు ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం ‘అజ్ఞాతవాసి’ రేంజ్ లోనే ఉన్నాయి. ఇదే రేంజ్ ఊపు ని కాస్త కొనసాగిస్తే చాలు, ప్రీమియర్స్ లో అజ్ఞాతవాసి రికార్డు బద్దలైనట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి (Jailer) సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం కంటే కూడా ఎక్కువ గ్రాస్ ని రాబట్టింది. ఇక తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ రజినీకాంత్ ని మించిన హీరో లేడు అనడానికి ఉదాహరణ ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూడండి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!