‘ఖుషి’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తరువాత 5 ప్లాపులను చవి చూసాడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) . ‘ఇక పవన్ కళ్యాణ్ కు హిట్టు రాదా..? ఇక అతని పని అయిపోయిందా?’ అనే కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే 2008వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ‘జల్సా’ (Jalsa) చిత్రం సూపర్ హిట్ అయ్యి.. అలాంటి కామెంట్లకు బ్రేక్ వేసింది.చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గ సినిమా ఏమీ కాదు. మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన మూవీ అసలే కాదు. సంజయ్ సాహు అనే కుర్రాడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను తెలిపే చిన్న కథ ఇది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయనే చెప్పాలి. అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది ‘జల్సా’. నేటితో ‘జల్సా’ రిలీజ్ అయ్యి 16 ఏళ్లు పూర్తికావస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి:
నైజాం | 9.35 cr |
సీడెడ్ | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 2.85 cr |
ఈస్ట్ | 2.00 cr |
వెస్ట్ | 1.80 cr |
గుంటూరు | 2.05 cr |
కృష్ణా | 1.80 cr |
నెల్లూరు | 1.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.54 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.90 cr (షేర్) |
‘జల్సా’ చిత్రం రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.3.89 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.