Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరెకెక్కిన పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ (Jana Nayakdu). వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక వివాదాలు, సెన్సార్ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఓ దశలో ఈ సినిమా రిలీజ్ కాదేమో అని అంతా అభిప్రాయపడ్డారు.

Jana Nayakudu Movie

మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి జూలై 23న విడుదల కాబోతోంది ఈ సినిమా. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ విజయ్ (Vijay) నటించిన ఆఖరి సినిమా కావడంతో.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూడాలని కొంతమంది ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. దీంతో తెలుగులో కూడా ‘జన నాయకుడు’ (Jana Nayakdu) చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే:

నైజాం 3 cr
సీడెడ్ 1.5 cr
ఉత్తరాంధ్ర 1.8 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.30 cr
కృష్ణా 1.0 cr
గుంటూరు 0.80 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 9.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్(తెలుగు వెర్షన్) 9.7 cr

 

‘జన నాయకుడు’ (Jana Nayakdu) చిత్రం తెలుగు వెర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా రూ.9.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీ అనే చెప్పాలి.

పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus