అదేంటి.. పూజా హెగ్డే రీ రీఎంట్రీ ఏంటి? అని అనుకుంటున్నారా? ఆమె ఫిల్మోగ్రఫీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే పూజా తెలుగులోకి ఓసారి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక సినిమా మాత్రమే ఇప్పుడు ఓకే అయి ఉంటే రీ రీ ఎంట్రీ అని అనేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఆమె వరుస సినిమాలకు తెలుగులో సైన్ చేస్తోంది అని సమాచారం. అందులో ఆ ఇద్దరు అగ్రహీరోలే కావడం గమనార్హం.
పూజా హెగ్డే కొత్త సినిమాలు ఏంటా అని చూస్తే.. అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ సినిమా ఒకటి కనిపించింది. రీసెంట్‌గా సరైన హిట్ లేని ఆమెకు ఇప్పుడు బన్నీ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా అనే డౌట్ అందరికీ వచ్చింది. అయితే లోకేశ్ కనరాజ్ ఆమె కోసం ఓ పాత్ర రాసుకున్నారని, ‘కూలీ’ సినిమాలో ‘మోనిక’ సాంగ్ సమయంలోనే ఈ ఆలోచన చేశారని టాక్. ఇక ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు రవితేజతో పూజ ఓ సినిమాకు సైన్ చేసిందని చెబుతున్నారు.
హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రవితేజ, శ్రీ విష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వీరాధి వీరులంట’ అనే పేరు ఈ సినిమాకు కన్‌ఫామ్ చేశారట. ఇందులో ఓ హీరోయిన్‌గా పూజను ఎంపిక చేశారు అని సమాచారం. ఈ మేరకు సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటే నాయకనాయికల అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందట. శ్రీవిష్ణు సరసన యంగ్ హీరోయిని ఒకరిని చూస్తున్నారట. ఈ వివరాలన్నీ త్వరలో చెప్పేస్తారు.
ఈ రెండు సినిమాలు కాకుండా పూజా డిస్కషన్‌లో మరో రెండు పెద్ద సినిమాలే ఉన్నాయట. ఆ లెక్కన ఇది ఆమెకు రీ రీఎంట్రీనే. అన్నట్లు ప్రస్తుతం పూజా చేతిలో వరుస సౌత్ సినిమాలు ఉన్నాయి. లారెన్స్ ‘కాంచన 4’, దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె ఇప్పుడు చేస్తోంది.