Janhvi Kapoor: పింక్‌ శారీతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న జాన్వీ… శ్రీదేవిని మరపిస్తోంది అంటూ..!

కథానాయికలు ఫొటో షూట్‌లు చేయడం సర్వసాధారణం, అవి వైరల్‌ అవ్వడం ఇంకా సాధారణం. అయితే చేసిన ప్రతి షూట్‌ హిట్‌ అవ్వడం, వైరల్‌ అవ్వడం చూశారా? అయితే జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓపెన్‌ చేయండి మీకే అర్థమైపోతుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సోషల్‌ మీడియాకు, సినిమాలకు పరిచయమైన జాన్వీ కపూర్‌.. తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. సినిమాల ఎంపిక, గ్లామర్‌ ఒలకబోతలో ఆమె స్టైలే వేరు.

తాజాగా చేసిన ఫొటో షూట్‌తో మరోసారి ఆ విషయం నిరూపించింది. ఒకప్పుడు ఈ ఆప్షన్‌ లేదు కానీ… ఇప్పుడ ఈ ఆప్షన్‌ను మన హీరోయిన్లు తెగ వాడేస్తున్నారు. అదే సోషల్‌ మీడియా. సినిమాల్లో ఒలకబోస్తున్న అందాలు కంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు తమ ఇమేజ్‌కు భిన్నంగా కొత్త తరహా దుస్తుల్లో మెరుస్తున్నారు కూడా. జాన్వీ కపూర్‌ కూడా ఈ ఒరవడిని బాగా పట్టేసింది. ఓసారి చీర కడితే, మరోసారి బికినీ వేస్తోంది.

ఓసారి స్కిన్‌ ఫిట్‌ మినీ వేస్తే, మరోసారి ఇంకాస్త పొట్టి బట్టలు వేస్తోంది. అయితే ఏం చేసినా ఆమె అందం కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో జాన్వీ కపూర్‌ లేటెస్ట్‌గా ఓ పింక్‌ శారీలో కనిపించింది. మామూలుగా పింక్‌ అనేది అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది అంటారు. జాన్వీ లాంటి అందగత్తె ఒంటికి ఆ రంగు ఇంకాస్త మసాలాను యాడ్‌ చేసింది. ఈ చీరలో ఆమెను చూస్తే శ్రీదేవిని మరపించే అందంలో కనిపిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు.

అందాల ఆరబోత అంటే పొట్టి బట్టలే కాదు.. ఇలా పింక్‌ శారీ కూడా చాలు అని పొగిడేస్తున్నారు. జాన్వీకి చీరలు అందం తీసుకొస్తాయా? లేక చీరలకే జాన్వీనే అందం తీసుకొస్తుందో అనేట్లుగా గతంలో కూడా కొన్ని షూట్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి మించిన చీరకట్టు అందం తాజా ఫొటోల్లో చూడొచ్చు. ఇక్కడ కొన్ని ఫొటోలే ఉన్నాయి. ఆమె (Janhvi Kapoor) ఇన్‌స్టాలో ఇలాంటివి బోలెడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus