టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే… ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ ప పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. సతీష్ మాట్లాడుతూ.. “దాదాపు 500 మంది సభ్యులున్న డాన్సర్ యూనియన్ కు 2023 ఎన్నికల్లో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
అంతకుముందు ఉన్న వాళ్ళు పెద్దగా పని చేసింది లేదు. అయితే ‘నేను వస్తే.. సభ్యులందరికీ ఇన్సూరెన్స్, ఇల్లు వంటివి ఇప్పిస్తానని జానీ వాగ్దానం చేశాడు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన జానీ ..ఈసారి 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు. అనంతరం జనరల్ బాడీ మీటింగ్లోనూ, కార్యవర్గ మీటింగ్లోనూ తాను చెప్పిన హామీలు నెరవేరుస్తానని తెలిపాడు. కానీ ఇంతవరకు నెరవేర్చింది లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , రామ్ చరణ్ (Ram Charan) , చంద్రబాబుతో మాట్లాడుతున్నాం… త్వరలో వచ్చేస్తాయి అంటూ దాటేశాడు.
హైదరాబాద్లోని స్థలానికి వారికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు” జానీ మాస్టర్ పై ఆరోపణలు చేశాడు. వీటిపై జానీ మాస్టర్ స్పందిస్తూ.. “ఇక్కడ నేను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి సంబందించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో 5 కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నాం. అది సమస్యల్లో చిక్కుకుంది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు.
నేను అధ్యక్షుడు అయ్యి 6 నెలలు అవుతోంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. ఆ సమయంలో నేను పాటలు వినను. కొరియోగ్రఫీ కూడా చేయను. నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఈ 6 నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసన గారితో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం.
పలు పనులు చేశాం. ఆయన వీడియోలో చెప్పిందాంట్లో నిజం లేదు. ఒకవేళ నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను. నేను కేవలం నా జనాల కోసం పనిచేస్తున్నాను. నా వల్ల పవన్ కళ్యాణ్, చరణ్ వంటి వాళ్ళకి మాట రాకూడదని నేను ఈ మీటింగ్ పెట్టి అందరికీ క్లారిటీ ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.