Jani Master: పవన్ పీఎం అవుతారంటూ జానీ మాస్టర్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ (Jani Master) ఒకరు కాగా జానీ మాస్టర్ ఒకరు కాగా జానీ మాస్టర్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో జానీ మాస్టర్ పవన్ (Pawan Kalyan) పై తన అభిమానాన్ని చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

Jani Master

జానీ మాస్టర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అని 2029లో కచ్చితంగా ఆయన సీఎం అవుతారని 2034లో పీఎం అవుతారని ఇది రాసిపెట్టుకోండని జానీ మాస్టర్ పేర్కొన్నారు. మరి రాబోయే రోజుల్లో జానీ మాస్టర్ మాటలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ త్వరలో షూటింగ్స్ లో పాల్గొననున్నారు. పవన్ వరుసగా 5 నెలల డేట్స్ కేటాయిస్తే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే ఛాన్స్ ఉంది.

2025 సంవత్సరంలో పవన్ మూడు సినిమాలు రిలీజైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. పవన్ ఏ సినిమాకు మొదట డేట్స్ కేటాయిస్తారనే చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు సినిమా సినిమాకు లుక్ విషయంలో పవన్ కళ్యాణ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గతంతో పోల్చి చూస్తే పవన్ సినిమాల బడ్జెట్లు సైతం పెరిగాయనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ క్రేజీ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. పవన్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

పోస్ట్ పోన్ అయిన ‘జనక అయితే గనక’.. కారణం అదేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus