‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబుకి(Sudhir Babu) ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి వస్తున్నాయి. పోతున్నాయి..! కానీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.చాలా మంది ప్రేక్షకులకు సుధీర్ బాబు సినిమాలు వచ్చి వెళ్తున్నట్టు కూడా తెలీదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ‘జటాధర’ అనే మైథలాజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీని ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. నవంబర్ 7న మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘జటాధర’. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా సో సో గానే వచ్చాయి. కానీ డిజాస్టర్ తో కంపేర్ చేస్తే అవి పర్వాలేదు అనే రేంజ్లోనే నమోదయ్యాయి అని చెప్పాలి.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.42 cr |
| సీడెడ్ | 0.15 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.53 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.1 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
| ఓవర్సీస్ | 0.09 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 1.34 కోట్లు(షేర్) |
‘జటాధర'(Jatadhara) సినిమాకు రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.34 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.1.66 కోట్లు షేర్ ను రాబట్టింది. ఆదివారం ఈ సినిమా కొంత గ్రోత్ చూపించింది. ఇదే విధంగా వీక్ డేస్ లో కూడా కలెక్ట్ చేస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.