అతను లేకపోతే ఆ సినిమా స్థాయి వేరేలా ఉండేది..

  • August 23, 2017 / 12:02 PM IST

కొన్ని సినిమాలు చూసి.. “సినిమా ఏముందిరా.. హీరో వేరే వాడైతే అదిరిపోయేది” అని సగటు సినిమా ప్రేక్షకులు థియేటర్ దగ్గర డిస్కస్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది. “మగధీర” రిలీజ్ అయినప్పుడు చాలామంది ఈ రేంజ్ సినిమా “ప్రభాస్”కి పడి ఉంటే ఇంకోలా ఉండేది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అలాగే చాలా సినిమాలకు ఆ తరహా స్టేట్ మెంట్స్ చూసే ఉంటాం. తాజాగా.. “జయ జానకి నాయక” సినిమాకి అలాంటి స్టేట్ మెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలై మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొని విజయపధంలో ముందుకెళుతోంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, కథలోని ఎమోషన్ బాగుందని చెబుతున్నవారే ఇదే సినిమా ఏ ఎన్టీయార్ కో లేక అల్లు అర్జున్ కో పడుంటే అదిరిపోయేది అంటున్నారు. అది కూడా నిజమే.. ఎందుకంటే అదే స్థాయి ఫైట్స్ మన ఎన్టీయార్ లేక అల్లు అర్జున్ చేసి ఉంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేది. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ సినిమా కూడా బానే ఆడుతుంది కాబట్టి, మన బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త్వరలోనే ఆ హీరోల స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus