ఈ ఏడాది అప్పుడే చాలా మంది సినిమా వాళ్లు మరణించారు. దర్శకురాలు అపర్ణ మల్లాది నుండి మొదలు పెడితే సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్,హాలీవుడ్ సీనియర్ హీరో జీన్ హ్యాక్ మ్యాన్ వంటి వారు కన్నుమూశారు.
ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. మళ్ళీ ఇంకో చేదు వార్త వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు నిన్న సాయంత్రం ఆయన కన్నుమూసినట్టు జయప్రద (Jaya Prada) తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ” నా అన్న శ్రీ రాజబాబు మరణవార్త మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాను.
ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 :26 గంటలకు హైదరాబాద్లో ఉన్న మా నివాసంలో ఆయన చివరి శ్వాస విడిచారు. మా అన్న ఆత్మకు శాంతి చేకూరాలని దయచేసి మీరంతా ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘రాజబాబు ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే మీ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు’ అంతా కామెంట్స్ చేస్తున్నారు.