సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్న ప్రియమణి (Priyamani) .. గత కొన్నేళ్లుగా ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. దీనికి కారణం ఆమె పెళ్లి. ముస్తఫారాజ్ అనే తన స్నేహితుణ్ని ప్రియమని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి ఇద్దరినీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఇబ్బంది పడుతూ వచ్చిన ప్రియమణి రీసెంట్‌గా ఫైర్ అయ్యింది. పిల్లల్ని కూడా వదలరా ఏంటిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ప్రియమణి.
అయితే 2017 ముందు ఆమెకు సినిమా ఛాన్స్‌లు తగ్గుముఖం పట్టాయి. ఆ సమయంలోనే సినిమాలకు దూరమవుతుందేమో అనుకున్నారంతా. కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ విషయం పక్కనపెడితే.. 2016 ప్రియమణి – ముస్తఫారాజ్ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రియమణి గురించి, వారి కుటుంబం గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారని చెప్పింది తమన్నా.
ఎంగేజ్‌మెంట్ జరగ్గానే నా మనుషులంతా ఆనందిస్తారని అనుకున్నాను. వారితో ఆ హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకోవాలి అనుకున్నా. కానీ, అప్పటి నుండి నాపై ద్వేషం ప్రారంభమైంది. లవ్ జిహాద్ ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరైతే పిల్లలు పుట్టాక వారిని ఐసిస్‌లో జాయిన్ చేస్తారా అని కూడా కామెంట్స్ పెట్టారు. అవి మమ్మల్ని బాధపెట్టాయి. నేను ప్రజల మధ్య ఉండే వ్యక్తిని కాబట్టి పట్టించుకోను. కానీ, నా భర్తపై అలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రియమణి.
భర్తతో నేను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. చాలావరకు కామెంట్స్ మా పెళ్లి మీదనే ఉంటాయి. వాటివల్ల బాధపడాల్సి వస్తోంది అని ప్రియమణి చెప్పింది. ఇది చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేసింది. విజయ్ తమిళ సినిమా ‘జననాయగన్’లో (Jana Nayagan) ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రలో కనిపించనుంది.