ఎన్టీయార్ హీరోగా సినిమా తీస్తున్న మహేష్ బావ!

“స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ” చిత్రాల తర్వాత ఎన్టీయార్-రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎన్టీయార్ అభిమానులందరూ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య.. వారాహి వారు ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఏమీ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం.. “బాహుబలి 2” అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా ఉండబోతోందని, ఆ సినిమాని మహేష్ బావమరిది మరియు టిడిపి ఎంపి అయిన జయదేవ్ గళ్ళ నిర్మించనునాడని తెలుస్తోంది.

2017లో ఈ ప్రోజెక్ట్ పట్టాలేక్కానుందని ప్రస్తుతం వార్తలు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. రాజమౌళి లేదా ఎన్టీయార్ లలో ఎవరో ఒకరు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తే గానీ ఈ వార్తల్లో నిజం ఎంతో చెప్పలేం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus