జెడి చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే జెడి చక్రవర్తి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే జెడి చక్రవర్తి గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన అనుకున్న వాళ్లే తనకి ద్రోహం చేశారని తెలిపారు.
తనని చంపాలన్న ఉద్దేశంతో ఎనిమిది నెలలపాటు తనకు స్లో పాయిజన్ ఇచ్చారని తెలిపారు. కేవలం డాక్టర్ నాగార్జున గారి దయవల్ల నేను బ్రతికి ఉన్నానంటూ గతంలో జెడి చక్రవర్తి తనపై విష ప్రయోగం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు.ఇకపోతే చాలామంది తనకు అయిన వాళ్లే అంటే తన భార్య అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో తన భార్య తనపై విష ప్రయోగం చేసింది అంటూ థంబ్ నెయిల్స్ ఉపయోగించారు.
ఇలా జెడి చక్రవర్తి (JD Chakravarthy) పై తన భార్య విష ప్రయోగం చేసింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి అయితే తాజాగా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి జెడి చక్రవర్తి ఈ వార్తలపై స్పందించారు.. నేను గత ఇంటర్వ్యూలలో నా అనుకున్న వాళ్ళే నాపై విష ప్రయోగం చేశారని చెప్పాను అయితే చాలామంది నా భార్య నాపై విష ప్రయోగం చేసింది అంటూ వార్తలు సృష్టించారు
అయితే తన భార్య గురించి ఇలా వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.ద్రోహం దగ్గర ఉండే వాళ్ళు మాత్రమే చేయగలరని ఈయన తెలిపారు. అది స్నేహితులైన కావచ్చు మనం నమ్మినవారైనా కావచ్చు అంటూ మరోసారి జె.డి చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.