‘పుట్టిన వాడు గిట్టక తప్పదు’.. దీనిని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం.ఇది ఒక చేదు నిజం. నిజజీవితంలో దీనిని ఎక్కువగా తలుచుకోవడానికి.. ఇలాంటి పదాన్ని వినడానికి ఇష్టపడం. ‘కానీ చంపేస్తా అని బెదిరించడం, చస్తావు అని శాపనార్ధాలు పెట్టడం’ వంటివి ఈజీగా చేసేస్తాం. అయితే ఇలాంటి పాయింట్ తో కూడా సినిమాలు వచ్చాయి. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. అయితే చావు అనే కఠినమైన కాన్సెప్ట్ ను ఎంటర్టైన్మెంట్ గా చెప్పడం అంత ఈజీ కాదు. కానీ ఈ పాయింట్ ను టచ్ చేస్తూ కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని హిట్ అయ్యాయి. ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1 ) మురారి :
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2001 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓ వంశానికి తగిలిన శాపం..ప్రతి 48 సంవత్సరాలకి ఒకరు మరణిస్తూ ఉంటారు. తర్వాత హీరో(మహేష్ బాబు) వంతు వస్తుంది. ఆ సినిమా కథ మృత్యువు చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
2) చక్రం :
కృష్ణవంశీ.. ప్రభాస్ తో చేసిన సినిమా ఇది. ఇందులో కూడా హీరో క్యాన్సర్ తో చనిపోతాడు. ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుని అతను చావు గురించి చెప్పే ఫిలాసఫీతో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
3) ఆ నలుగురు :
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో చంద్ర సిద్దార్థ్ డైరెక్ట్ చేసిన మూవీ. ఇందులో మెయిన్ రోల్ చనిపోతుంది. అక్కడి నుండి అతని దహన సంస్కారాల వరకు ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
4) మీ శ్రేయోభిలాషి :
ఇందులో కూడా రాజేంద్ర ప్రసాద్ మెయిన్ రోల్ పోషించాడు. ఇది కూడా చావు అనే కాన్సెప్ట్ తో రూపొందిన మూవీనే. తనతో పాటు చనిపోవాలి అనుకునే వాళ్లంతా ఓ బస్ లో ప్రయాణిస్తుండటం చివరికి ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
5) మిత్రుడు :
బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా చావు కాన్సెప్ట్ తోనే రూపొందింది. కానీ సినిమా ప్లాప్ అయింది.
6) నేను నా రాక్షసి :
ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళని వీడియో తీసి… వాటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. చివరికి ఆమె కూడా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.పూరి జగన్నాథ్ ఈ కథని బాగా తీసినా.. జనాలకి ఈ సినిమా అర్థం కాలేదు. దీంతో పెద్ద డిజాస్టర్ అయ్యింది.
7) వెంకీ మామ :
ఈ సినిమాలో వెంకటేష్ – నాగ చైతన్య హీరోలు. మేనమామ మేనల్లుడి చేతిలో మరణించడం అనే కాన్సెప్ట్ చుట్టూ.. ఈ సినిమా కథ నడుస్తుంది.ఈ సినిమా బాగానే ఆడింది.
8) ప్రతిరోజూ పండగే :
ఈ సినిమాలో క్యాన్సర్ తో బాధపడే తాత.. చివరి రోజుల్లో ఫ్యామిలీతో ఆనందంగా గడపడం.. దాని ద్వారా కుటుంబ సభ్యులకి వచ్చిన సమస్యలను చూపించారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.
9) చావు కబురు చల్లగా :
ఈ సినిమా చావు కాన్సెప్ట్ తోనే రూపొందింది. కానీ ఇందులో హీరో చెప్పే ఫిలాసఫీ జనాలకి నచ్చలేదు. అందుకే సినిమా డిజాస్టర్ అయ్యింది.
10 ) బలగం :
ఈ సినిమా కథ కూడా హీరో తాత చావు చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ సంస్కృతి ప్రకారం చావు ఇంట్లో ఎలాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. అనేది కథ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
11) బ్రో :
ఈ సినిమాలో కూడా హీరో పాత్ర చనిపోతుంది. అయితే టైం అతనికి 90 రోజులు టైం ఇస్తే ఏం జరిగింది అనేది మిగిలిన కథ.చావు గొప్పతనాన్ని వివరిస్తూ ఈ కథ నడుస్తుంది. అయితే (v) ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.