Jeevitha Rajasekhar: వైరల్ రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?
- March 14, 2026 / 10:40 PM ISTByFilmy Focus Desk
కొన్ని మీమ్స్ ఎలా, ఎప్పుడు, ఎందుకు వస్తాయో.. ఎవరు పుట్టిస్తారో తెలియదు కానీ తరచూ కనిపించి నవ్విస్తుంటాయి. అలాంటి వాటిలో రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ఒకటి. ప్రముఖ నటుడు రాజశేఖర్‌కి ఓ గోటీల ఫ్యాక్టరీ ఉందని.. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తొలుత మీమ్స్ రాగా.. ఆ తర్వాత మేము రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ఉద్యోగులం అంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై రాజశేఖర్ భార్య నటి, దర్శకులు జీవిత రియాక్ట్ అయ్యారు.
Jeevitha Rajasekhar
గోటీల ఫ్యాక్టరీ ఏంటో, ఎవరు, ఎందుకు వైరల్ చేశారో తెలియదని చెప్పిన జీవిత.. రాజశేఖర్, తాను, పిల్లలు ఆ మీమ్స్, వీడియోలు చూసి నవ్వుకున్నామని చెప్పారు. అయితే కొందరు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోస్టులు చేస్తున్నారని విన్నానని, ఇలాంటి రీల్స్, ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని ఆమె కోరారు. దీంతో కొంతమంది నెటిజన్లు ‘ఇది నిజం కాదా.. మేమింకా నిజం అనుకున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్‌కి ఓ గోళీల ఫ్యాక్టరీ ఉందని, దాని ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది అనేది ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారం.

అంతేకాదు ఆ ఫ్యాక్టరీలో పని చేసే వారికి రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని అంటూ కొంతమంది నెటిజన్లు ఇంటర్వ్యూలు, ఐడీ కార్డులు రెడీ చేశారు. అయితే ఇదంతా ఫేకే అని అని ఇప్పుడు తేలింది. దీంతో ఇకనైనా ఈ గోటీల ఫ్యాక్టరీ గోల ఆగుతుందేమో చూడాలి. ఇక రాజశేఖర్ సినిమాల సంగతి చూస్తే.. శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల అవుతుంది. ఇది కాకుండా ‘లబ్బర్ పందు’ సినిమా రీమేక్ ఇటీవల మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ప్రస్తుతం ఆయన రెస్ట్‌లో ఉన్నారు. కోలుకున్నాక తిరిగి సినిమా స్టార్ట్ చేస్తారు.











