రాజమౌళి సినిమాలో రాజశేఖర్ నటించడంపై క్లారిటీ ఇచ్చిన జీవిత.!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి సినిమాల తర్వాత మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కించనున్నారు. రామ్ చరణ్, రామారావు(తారక్)లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ ప్రాజక్ట్ కి #RRR అనే పేరు పెట్టారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించనున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ కి విజయేంద్ర ప్రసాద్ తుది మెరుగులు దిద్దుతుండగా.. రాజమౌళి మాత్రం ఆర్టిస్టుల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్స్ గా ఆర్ అక్షరంతో పేరు కలిగిన వారిని పరిశీలిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్.. రష్మిక మందనను సెలక్ట్ చేసినట్లు టాక్.

ఈ సినిమాలో కీలకమైన విలన్ రోల్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ని తీసుకున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తను జీవిత రాజశేఖర్ ఖండించారు. ఈ రూమర్ పై ఆమె మాట్లాడుతూ.. ” మా కూతురు శివాని సినిమా ప్రారంభోత్సవానికి రమ్మని రాజమౌళిని ఆహ్వానించాము. మా కోరిక మేరకు వచ్చి మా కూతురిని దీవించారు. దీంతో అతని సినిమాలో మా వారు(రాజశేఖర్ ) నటిస్తున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అసలు రాజమౌళి ఏ పాత్ర కోసం రాజశేఖర్ ని అడగలేదు. ఆయన సినిమా గురించి మా వద్ద ప్రస్తావనే తీసుకురాలేదు” అని క్లారిటీ ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus