తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం.. ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌తో జైపూర్ లో ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్,రాంచరణ్,జూ.ఎన్టీఆర్,నాని,రానా,అఖిల్ వంటి హీరోలు హాజరయ్యి సందడి చేసారు. దీంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా అక్కడే జరుపుకుంది జక్కన్న కుటుంబం.
ఇక తాజాగా మరోసారి కార్తికేయ, పూజ లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఈ విషయం పై జగపతి బాబు తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తన అల్లుడు కార్తికేయకు ఆహ్వానం పలుకుతూ పోస్ట్ చేయడం విశేషం. ఈ పెళ్లి కారణంగా వారి కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయో తెలియజేసేలా ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. దీని పై జగపతి బాబు స్పందిస్తూ.. “పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు(కార్తికేయ)గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్‌కమ్ అల్లుడుగారు’’ అంటూ జగ్గూభాయ్ పోస్ట్ చేసాడు. ఇక త్వరలోనే రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’.. అలాగే కార్తికేయ ‘ఆకాశవాణి’ షూటింగ్ లను తిరిగి ప్రారంభించనున్నారు.