అతిలోక సుందరి కూతురితో.. విక్రమ్ కొడుకు రొమాన్స్..?

విక్రమ్ కుమారుడు దృవ్ హీరోగా పరిచయమవుతున్న ‘వర్మ’ చిత్రాన్ని ఇటీవల కొన్నికారణాల వలన రీషూట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి ఇది రీమేక్. మొదట ఈ చిత్రాన్ని బాలా డైరెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు వేరే డైరెక్టర్ తో ఈ చిత్రాన్ని రిషూట్ చేయనున్నారు. ఫైనల్ కాపీ చూసిన నిర్మాతలకి., విక్రమ్ కి ఈ చిత్రం నచ్చకపోవడంతో ఈ చిత్రాన్ని రీషూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ధృవ్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం నుండీ తప్పుకున్నట్టు దర్శకుడు బాలా కూడా తాజాగా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ‘వర్మ’ చిత్రానికి సంబంచిన టీం ని మొత్తం మార్చేయాలని.. ఈ చిత్ర నిర్మాతలైన ‘ఈ4 ఎంటర్టైన్మెంట్స్’ వారు భావిస్తున్నారట. డైరెక్టర్ ప్లేస్ లో గౌతమ్ మీనన్ పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ‘ధ్రువ నచ్చత్రం’ చిత్రంతో విక్రమ్ కి గౌతమ్ మీనన్ కి మంచి అనుబంధం ఏర్పడిందట. దీనివలనే విక్రమ్.. గౌతమ్ మీనన్ ని రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులోనూ గౌతమ్ మీనన్ లాంటి డైరెక్టర్ అయితే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కి కరెక్ట్ అని విక్రమ్ భావిస్తున్నాడట. ఇక హీరోయిన్ మేఘనా చౌదరి ప్లేస్ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తీసుకోబోతున్నారట. జాన్వీ పేరు బయటకి రావడంతో ఈ చిత్రం పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రీమేక్ లో నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే… ఇది జాన్వీకి కోలీవుడ్ రీమేక్ అవుతుంది. అంతే కాదు.. ఈ చిత్రానికి భారీ క్రేజ్ రావడం కూడా ఖాయం అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags